Friday 22 November 2013

శభాష్ మహిళా - వైకల్యాన్ని జయించారు..

                        ఆత్మవిశ్వాసాన్నే ఆలంబనగా చేసుకొని సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు తహతహలాడారు. అంగవైకల్యం అడ్డుగా నిలిచినా తాము కన్న కలలను సాకారం చేసుకునేందుకు, ఐదువేళ్లు నోట్లోకి వెళితేనే ముద్ద నోట్లోకి వెళుతుందని ఆ ఐదుగురు మహిళలు నిరూపించారు. ఆసరా ఇచ్చే చేతులను అందిపుచ్చుకొని కేవలం 200 చదరపుటడుగుల దుకాణంతో వారు వేసిన అడుగు నేడు స్వావలంబన దిశగా పయనిస్తోంది. రెండు నెలల క్రితమే కేరళలోని వాజిచల్ సమీపంలో ఏర్పాటుచేసిన ఆ దుకాణంలో ప్రతి వస్తువు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ దుకాణంలోని ప్రతి వస్తువు వెనుక వారి శ్రమ, నైపుణ్యం, అంతకమించి వాటిని తయారుచేయటంలో చూపించే శ్రద్ధ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అందుకే అక్కడి వస్తువులన్నీ కష్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. నేడు ఈ దుకాణం రూపురేఖలే మారి పోయాయ. ఆ ఐదుగురు మహిళలు 40 నుంచి వంద శాతం వివిధ రకాల వైకల్యంతో బాధపడుతున్నవారే. ఈ ఐదుగురు ఓ టీమ్‌గా తయారై, కలిసికట్టుగా పనిచేస్తే ఈ సమాజమే తమను గుర్తిస్తుందని నిశ్చయించుకున్నారు. ఇంకా చదవండి.

No comments:

Post a Comment