Friday 22 November 2013

ఆర్థికమంతా అతివల చేతుల్లోనే...



               స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య బాధ్యతలు స్వీకరించడంతో - మన దేశంలో ప్రముఖ బ్యాంకులన్నిటికీ ముఖ్య అధికార స్థానాల్లో మహిళలే ఉన్నట్టయింది. 207 ఏళ్ల ఆ బ్యాంకు చరిత్రలో ఛైర్‌పర్సన్‌గా ఒక మహిళ నియమితమవడం ఇదే తొలిసారి. సహోద్యోగులు చెబుతున్నదాని ప్రకారం, అరుంధతి తొమ్మిది స్థానాలున్న సంఖ్యలతో లెక్కలు సైతం బుర్రలోనే చే సెయ్యగలరు! 1977లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కోల్‌కతాలో కెరీర్ ప్రారంభించిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూనే, తోటి మహిళా ఉద్యోగుల సాధకబాధకాలు పట్టించుకోవడంలో ముందుండేవారు. అటు కుటుంబాన్నీ ఇటు ఉద్యోగ జీవితాన్నీ సరిగా చూసుకోవడానికి స్త్రీలెంత కష్టపడతారో ఆమె బాగా అర్థం చేసుకుని వ్యవహరిస్తారని అరుంధతితో పాటు పనిచేసిన ఉద్యోగినులు చెబుతున్నారు. ఎస్‌బీఐలో రెండు లక్షల మంది ఉద్యోగులుంటే వారిలో 40వేల మంది మాత్రమే మహిళలున్నారు. మహిళా ఉద్యోగులు కోసం ఆరోగ్య పరీక్షలు ప్రవేశపెట్టిన ఘనత అరుంధతి సొంతం. వచ్చే మూడేళ్లలో ఆమె ముందు చాలా సవాళ్లు ఉన్నప్పటికీ వాటన్నిటినీ తన ప్రతిభతో సమర్థంగా నెగ్గుకొస్తారని ఆశిస్తున్నారు ఆమె సహోద్యోగులు. ఇంకా చదవండి .

No comments:

Post a Comment